26, డిసెంబర్ 2012, బుధవారం

చీక‌టి




రేయే లేక‌పోతే ప‌గ‌లుకి వెలుగెందుకు
చీక‌టేగా వెలుతుర్ని గెలిపించేది
చీక‌టి వ‌ల్ల పుట్టాం, చీక‌ట్లో పుట్టాం
స‌గం జీవితం చీక‌ట్లో జీవిస్తాం
చీక‌ట్లోనే యుద్ధాలు చేస్తాం
దీర్ఘాలోచ‌నలు చేస్తాం
శ్వాస‌ దీర్ఘంగా వదులుతాం
స్వర్గ సుఖాల్ని పొందుతాం
పైకి మాత్రం వెలుగు కావాలంటాం
చీక‌టిని జ‌యించాలంటూ దీపాలు వెలిగిస్తాం..
నిజానికి మ‌నిషికి కావ‌ల్సిందే చీక‌టి... మ‌నిషే వెలుగు