23, నవంబర్ 2012, శుక్రవారం


నీవు - నేను


క్రియ నీవు వాక్యం నేను
సారం నీవు జ్ఞానం నేను

స్వరం నీవు ఘనం నేను
కవి నీవు కావ్యం నేను

యుక్తి నీది శక్తి నాది
ఆవేశం నాది ఆలోచన నీది

ఉరుము నీవు మెరుపు నేను
ఆకాశం నీవు (స్కై) అగాధం నేను 

సత్యనారాయణుడివి నీవు
సత్యవ్రతుణ్ని నేను

జలధి నీ జ్ఞానం
నిశీధి నా విజ్ఞానం

ఇదే అగ్రజా, కనిష్టుల సంబంధం