17, సెప్టెంబర్ 2012, సోమవారం

ఎంత వార‌లైనా….



క‌ళ్ళు మూసుకున్నాడు... బ్రహ్మ
ఎదురుగా భార‌తి....
ఈరోజు మీకు మూడింద‌న్నట్లుగా ఉంది ఆమె చూపు....
ఆమె న‌య‌నాలు  ఆమె మేనిరంగుతో పోటీ పడుతున్నాయి ఆస‌మ‌యంలో...

చూడాలి... ఎలాగైనా  చూడాలి
చూసెయ్యాలి.... అంతు తేల్చేయాలి అనుకున్నాడు... బ్రహ్మ‌....
త‌న‌కి తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు...

నేనెవ‌ర్ని...
స‌క‌ల లోకాల సృష్టిక‌ర్తని...
నేనే లేక‌పోతే ఈ అన్యాయాల‌న్నీ శూన్యాలైపోయేవి....
నే గీసే గీత ఎలాంటివారికైనా మోత...
అలాంటిది న‌న్నే భ‌య‌పెడుతుందా.... ఎంత ధైర్యం... హాయ్‌
ఎత్తుతా ఏంచేస్తుందో చూస్తా
అని అనుకుని త‌ల ఎత్తబోయాడు బ్రహ్మ....

ఇంతలో ‘’ఏంటి ముంగిలా కూర్చున్నారు...
ఇందాక‌ట్నించి అరుస్తుంటే వినపడట్లేదా మీకు….
మాట్లాడ‌రేంటి స‌మాధానం రాదే’’.... అంది భారతి శ్రావ్యంగా
పైకెత్తబోతున్నత‌ల‌కాస్తా  మ‌రింత కింద‌కి దిగింది...
ఒక్కసారిగా త‌ల తిరిగినట్టయింది బ్రహ్మకి
నాలుగు తలలుండి ఒక్క తల ఎత్తలేకున్నానే..

ఏంటీ వైప‌రీత్యం....
నామీద అజ‌మాయిషీయా... కాదు కాదు అధికార‌మే చెలాయిస్తోందే....
ఎందుకిలా జ‌రుగుతోంది... గ్రహ‌స్థితులు బాగోలేవా ఏం...
ఓ సారి చూపించుకోవాలి, త‌క్షణ ప‌రిహారం చేయించుకోవాలి... అనుకుని స్థిమిత ప‌డ్డాడు...

త‌న‌ల్ని ఓదార్చే వాళ్లుంటే బాగుణ్ననిపించిందాయ‌న‌కి....
వాళ్ల నాన్న గుర్తొచ్చాడు వెంట‌నే...
నాన్న ఎంత‌మంచోడు...
క‌డుపులో పెట్టుకు చూసుకున్నాడు న‌న్ను....
ఎంత‌బాగుండేద‌ప్పుడు చీకూ చింతాలేకుండా....
నాన్నద‌గ్గరకి వెళ్లాలి.... వెంట‌నే వెళ్లిపోవాలి... అనుకున్నాడు
అంతే ఒక్కసారిగా ఉత్సాహం త‌న్నుకొచ్చింది...
మూడు ముక్కులు బ‌ర్రున చీది...... తుర్రున ప‌రిగెట్టాడు పుట్టింటికి...

నాన్నా... నాన్నోయ్అంటూ ప‌రిగెట్టాడు ఇంట్లోకి...
ఎక్కడా క‌నిపించ‌డే ఎక్కడికి వెళ్లాల‌బ్బా అని వెతుకుతున్నాడు గదులన్నీ..
వాళ్లమ్మ మాట వినిపించిందింత‌లో... అటువైపెళ్లాడు...
ద‌గ్గర‌కు వెళ్ళేకొద్దీ వాళ్లమ్మ మాట‌లు స్పష్టంగా వినిపిస్తున్నాయి...
ఏంటీ ప్రవ‌ర్తన‌,  ఎన్నిసార్లు చెప్పాలి నీకు....
బుద్ధితెచ్చుకో ఇప్పటికైనాఅర్థమైందా....
కంచులా మోగుతోంది ఆమె కంఠం ...

బ్రహ్మ మ‌న‌సు కీడు శంకించింది...
నాన్న లేని స‌మ‌యం చూసి ఎవ‌డూ అమ్మకి అప‌కారం త‌ల‌బెట్టబోలేదు క‌దా...
ప‌రుగెట్టుకెళ్లాడు లోప‌లికి...
అమ్మా అనాల్సినవాడు కాస్తా........
నాన్నా..... బాబోయ్‌....అయ్యయ్యో ఏంటిది... అన్నాడు
వాళ్ళ నాన్నచూసాడు బ్రహ్మిని
సైగ చేసాడు... బ‌య‌ట‌కు వెళ్లమ‌ని....
చేసేదిలేక  బ‌య‌టకొచ్చేశాడు బ్రహ్మ..

బాబు బ‌య‌ట‌కు వచ్చిన వెంటనే బావురుమ‌న్నాడు...
బ్రహ్మిని బాబు’ ద‌గ్గర‌కు తీసుకున్నాడు...
గీయ‌డం అల‌వాటైపోయిన బ్రహ్మి బాబు గీతలు చూసాడు...
వాడికళ్లల్లో గిర్రున తిరిగాయి నీళ్లు

బాబూ ఏమిటీ వైప‌రీత్యం
మ‌ట్టంట‌కుండా మ‌ట్టుపెట్టడంలో నిన్నుమించిన వాడు లేడే....
అలాంటిది నీ చేతికి మ‌ట్టా.....
హ‌త‌విధీ... ఎందుకు ప‌రీక్షిస్తున్నావ్ మమ్మల్ని... అంటూ భోరుమన్నాడు

'బాబు' నవ్వాడు బ్రహ్మిని చూసి
వెర్రి వాడా... విధిని రాసేదే నువ్వు, అలాంటిదీ దాన్నంటావేవిట్రా...
ముంద‌ర‌కెవ‌డో... ''మావో'' అట భ‌లే మాట‌ చెప్పాడు
ప్రతీదీ దానికి విరుద్ధమైన‌దానితో బేధిస్తుంది... చివ‌రికి అందులోనే ల‌య‌మ‌వుతుంది... అని
ఆణిముత్యంలాంటి మాట క‌దా అన్నాడు ‘’బాబు’’

ఏడ్సిన‌ట్టుంది... మ‌నం మ‌న వాళ్లతో బేధించడమే.... ఇంకాన‌యం వేధించాలనలేదు...
అలాంటి పప్పులుడకే కదా.. నీ ద‌గ్గర‌కు ప‌రిగెట్టుకొచ్చింది...
మనబాధలన్నీ మటుమాయం అయిపొయేలా
సత్వరోపాయం ఓటి చెప్పు... అన్నాడు బ్రహ్మి

ఈ లోపులో వాళ్ళమ్మ అరుపు వినిపించింది బ్రహ్మికి….
బాబు’ వైపు తిరిగాడు చెబ్దామ‌ని...
చూసి తెల్లబోయాడు...
ఇంక్కెక్కడ 'బాబు' ఎప్పుడో మాయ‌మైపోయాడు...
ఎంత వేగం... ఏమి ప‌త్నిభ‌క్తి’…. అనుకున్నాడు.... బ్రహ్మి

అప‌ర సంధ్యవేళ దాట‌వొచ్చిందింత‌లో...
మెగ‌లిపూల వాస‌న నాసికా రంధ్రాల్లోకి చొచ్చుకు పోతోంది.....
బ్రహ్మి  శ‌రీరంలో ఉష్ణ స్థాయి పెరిగింది...
సంకల్పితంగా భా ర‌తి గుర్తొచ్చింది....

సుఖ కష్టం పిలుస్తోంది….
మ‌రుక్షణం స‌త్వలోకంలో ఉన్నాడు బ్రహ్మ.......

                      ఎంత వార‌లైనా...   అనుకున్నాను నేను….





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి