6, సెప్టెంబర్ 2012, గురువారం

గురువు


అర్జునుడి ఆకృతైన‌ ద్రోణుడే కాదు గురువంటే
బ‌లి బ‌ల‌వ‌న్మర‌ణాన్ని నిరోధించేందుకు నేత్రత్యాగం చేసిన‌ శుక్రాచార్యుడూ గురువే
శిష్యురాలి కోరిక పై భీష్ముడితో యుద్ధం చేసి ఓడిన‌ ప‌రశరాముడూ గురువే
మంచి చేసేందుకు  చేసిన ప్రతీ ప్రయ‌త్నంలోనూ  గురువు ఓడిపోయాడు...
అస‌లు గురువు ఎప్పుడు గెలిచాడ‌ని ? శిష్యుడి  వ‌ల్ల గురువుకి ఒరిగిందేమిటి? కోల్పోడం త‌ప్ప...

శిష్యుడి కోసం ఏకాక్షుడ‌య్యాడు శుక్రాచార్యుడు...
త‌ప‌ఫ‌లాన్ని కోల్పోయాడు ప‌రశ రాముడు...
శిష్యుడి హితాన్ని కోరినందుకు ఆ శిష్యుని చేతిలోనే మ‌ర‌ణించాడు ద్రోణుడు

శిష్యుడి బాగుకోసం, శిష్యుడి విజ‌యం కోసం, శిష్యుడి కీర్తి కోసం... చేశాడా గురువు ఇవ‌న్నీ
శిష్యుడికి విద్య నేర్పించ‌డమే కాదు.. తాను ఉప‌దేశించిన అస్త్రాన్ని త‌న‌మీదే ప్రయోగిస్తున్నా
శిష్యుడి శౌర్యాన్ని, ధై ర్యాన్ని చూసి ఆనందించాడు గురువు..

త‌త్ఫలితం
శిష్యుడికి కీర్తి... గురువుకి ముక్తి...
శిష్యుడికి విజ‌య ప్రస్థానం... గురువుకి మ‌హా ప్రస్థానం

ఇది నీత‌ప్పూ నాతప్పూ కాదంటాడు గురువు... అందుకే అత‌ను గురువు
గురువుకి స్థాయి శిష్యుడి వ‌ల్ల రాదు, రాబోదు....
గురువు స్థాయిని గురువే అంచ‌నా వేయ‌గ‌ల‌డు
అందుకే దేవ‌గురువైన బ‌హ‌స్పతితో స‌మాన స్థాయి శుక్రాచార్యుడిది...
పోనీ పోల్చి చూడ‌రాదూ ఇద్దరు శిష్యప‌ర‌మాణువుల్ని ఈవిధంగా
సాధ్యం కాదు నీకు ముల్లోకాల్ గాలించినా, లేదు సాధిస్తానంటావా ఆ సాధించేక్రమంలో నీవైపోతావు ఓ గురువు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి